విజయవంతంగా ఉద్యోగానికి తిరిగి వెళ్ళడానికి 5 దశలు

Published on 11 Apr 2018 . 1 min read



Women To Successfully Restart Her Career Women To Successfully Restart Her Career

వృతి నిపుణులు కొంత విరామం తరువాత మరల ఉద్యోగానికి వెళ్ళడము అనేది వారిని ఆందోళనకు గురిచేసే ఒక కష్టమైన పని.  కాని మమ్మల్ని నమ్మండి, ఇది ఈ విషయమే కాదు. మీరు మీ వృత్తి లో విరామం తీసుకోక ముందు ఎలా వున్నారో ఇప్పటికీ మీరు అదే సామర్థ్యం గల వృత్తి నిపుణులు మరియు SAHM (ఇంటి వద్ద వుండే అమ్మ) గా ఉన్న ఈ వ్యవధిలో మీరు మరిన్ని అద్భుతమైన నైపుణ్యాలు నేర్చుకొన్నారు!

మీరు మీ పాత నమ్మకాన్ని మరల తట్టడానికి, మీ పునఃప్రారంభం విజయం కావడము కొరకు మేము 5 దశల గైడ్ ను కూర్చాము. మీరు మరల మొదలు పెట్టడానికి ఒక నిర్మాణాత్మకమైన పధ్ధతి అనేది  దానిని సులభతరం మరియు సమవర్థవంతము చేస్తుంది. ప్రారంభములో మీరు ఏమి చేయదలచుకోన్నారో తెలుసుకొనేందుకు మీరు కొంత సమయము తీసుకోనవలయును; అప్పుడు మీరు మరిన్ని ఎంపికలు అన్వేషించి ముందుకు వెళ్ళవచ్చు.        

దశ 1: ఖచ్చితంగా ఉండండి

సంసిద్ధతను తెలుసుకోవడం మొదటి దశ. చాలా సార్లు, నియమించుకునే మేనేజర్లు ఉగ్యోగానికి తిరిగి వెళ్లే తల్లుల వైపు చూసి ఇలా ఆశ్చర్యపడతారు, ”ఆమె తయారుగా వున్నదా? ఆమె నిర్వహించగలదా? ఆమె ఓడిపోతే ఎలా? వారు సందేహిస్తారు. ఇదే ప్రశ్నను మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మీరు ఉద్యోగానికి తిరిగి వెళ్ళడము అనే మీ నిర్ణయమును తప్పక మీరు జాగ్రత్తగా పరిశీలించాలి, మరియు దానిని సాధ్యము అయ్యేలా చేసే పద్ధతులు అందుబాటులో వున్నాయని నిర్ధారించుకోండి. మీరు ఉద్యోగానికి వెళ్ళడానికి నిజంగా తయారుగా వున్నారని నిర్ధారించుకోండి.

ఈ అతి ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానము చెప్పడాన్ని పరిగణించండి:                                               

1. ఇప్పుడు పని చేయాలని నేను ఎంతగా కోరుకుంటున్నాను?                                                                 

2. నేను నా ఉద్యోగము మధ్యలో విరామము ఎందుకు తీసుకోవలసి వచ్చినది? ఇది త్వరలో మారబోతుందా?

3. నాకు వుండే మద్దతు ఏమిటి?

దశ 2: మీ ఉద్యోగ ఎంపికలను అంచనా వేసుకొనండి

మీరు గతములో నిర్వహించిన స్థాయి ఉద్యోగాలపై మాత్రమే దృష్టి పెట్టే ఒక సంకుచిత శోధనతో మీ ఉద్యోగ అవకాశాలను పరిమితం చేయకండి.  కెరీర్ విరామం తర్వాత ఉద్యోగాల కోసం చూస్తున్నప్పుడు, ఉద్యోగ స్థాయి కంటే అవసరమైన నైపుణ్యాల పై మరింత శ్రద్ధ చూపండి.

మీరు కెరీర్ విరామమును ఎంపికలను అన్వేషించే ఒక అవకాశముగా పరిగిణించండి. మీ గత ఉద్యోగము మీరు చేయాలని కోరుకున్నదేనా లేక మీ ఉద్యోగాన్ని మార్చాలని అనుకొంటూ వుండినారా? ఇప్పుడు దానిని గురించి ఆలోచించడానికి మంచి సమయము. మీ నైపుణ్యాలను అంచనా వేసుకొనండి మరియు వాటిని వివిధ రంగాలలో వివిధ స్థాయిలలో వాటిని ఎలా వాడుకోవాలో ఆలోచించుకోండి. మీరు మీ రెండవ ఉద్యోగ ఎంపికలను అన్వేషించండి.

మీ ఉద్యోగములో మార్పు అనేది మీ జీవిత– మార్పు లాంటిదని అర్థము చేసుకోండి, మరియు ఇది  తేలికగా తీసుకోవలసిన నిర్ణయము కాదు. ఈ కొత్త ఉద్యోగం ఏమి ఇవ్వబోతుందో అనేది ఖచ్చితంగా తెలుసుకోండి. మరియు ఈ ఉద్యోగంలో మీరు సరిగా అమరుతారా? మీరు ముందుకు వెళ్ళేలోపే మీ కొత్త ఉద్యోగం గురించి పరిశోధన చేయండి.

దశ 3: మీ కుటుంబము యొక్క మద్దతును పొందండి

మీరు ఉద్యోగానికి తిరిగి వెళ్లేందుకు మీకు వున్న ఆసక్తి గురించి మీ కుటుంబంతో చర్చించండి. మీరు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకొనడము మరియు అన్నింటిని సంతులనము చేయడములోని నిజాలను పరిగణలోనికి తీసుకోవలసి వుంటుంది. మీకు మద్దతు మరియు బాక్ అప్ అవసరమైన అన్ని సంభావ్య పరిస్థితుల గురించి మీ కుటుంబముతో చర్చించండి. మీరు మీ బరువును పంచుకోవడం మరియు మీకు అవసరమయ్యే మద్దతు కొరకు ప్రణాళిక చేయడం అనేది ముఖ్యం.

మీరు ఉద్యోగానికి తిరిగి వెళ్ళినప్పుడు, మీ కుటుంబాన్ని నిమగ్నం చేయండి, మరియు చాలా ముఖ్యముగా మీ భాగస్వామిని. పరస్పర అంచనాల గురించి చర్చించుకోండి మరియు పిల్లల సంరక్షణ మరియు ఇతర బాధ్యతల గురించి ప్రణాళికలను తయారు చేయండి. రాజీపడటము అనేది చాలా ముఖ్యమైనది. మీరు రాజీ పడినవిధంగానే మీ భర్త మీతో రాజీ పడతారు. మీరు మీ పిల్లలకు ఒక గొప్ప రోల్ మోడల్ గా వుంటారు. ఇంటిపని లేక పిల్లలను చూసుకోనడములో సాయము కొరకు అడగండి, మరియు మీరు పోషాకాహరముతో కూడిన ఆహారమును అందించలేని పక్షములో మీ పైన మీరు కఠినంగా ఉండకండి. మీరు ఒక సూపర్ విమెన్ కాలేరు అన్నది గుర్తించండి.

ఉద్యోగము మరియు ఇంటి జీవితము రెండింటితోనూ పనిచేయడము అనేది ఒక పెద్ద అవగాహనతో కూడుకొన్నది.  మీరు ప్రతీ దాన్ని ‘పరిపూర్ణము’గా చేయలేకున్నప్పుడు మిమ్మల్ని మీరు తేలికగా తీసుకోండి.

దశ 4: మీ వృత్తి నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోండి

మీరు దూరంగా వున్నప్పుడు, చాలా మార్పు సంభవించి ఉండవచ్చును. కొత్త ధోరణులు మరియు సాంకేతికత ఉండవచ్చు. మిమ్మల్ని మీరు తక్కువగా భావించుకోకండి. మీకు ఇంతకు ముందు తెలిసినదానిని ఎవరూ తీసుకొని వెళ్ళలేరు. అదృష్టవశాత్తూ, మీరు కొత్త ధోరణులు మరియు సాంకేతికతలో మార్పులు గురించి నేర్చుకోడానికి ఇప్పుడు ఆన్ లైన్ కోర్సులు వున్నాయి. కొన్ని కోర్సులు ఉచితం కాగా కొన్ని ప్రియంగా వుంటాయి. మీరు మీ భవిష్యత్తులో పెట్టుబడి పెడుతున్నారు అని గుర్తుంచుకోండి. మీ పరిశ్రమలో ఈ మధ్యనే వచ్చిన కొత్త ధోరణులు ఏమిటి అని కనుగొని, ఆ నైపుణ్యాలను సంపాదించడానికి ఒక కోర్సు నేర్చుకోండి.      

దశ 5: ఉద్యోగాన్వేషణ నైపుణ్యాలను నవీకరించండి

ఉద్యోగాన్వేషణ నైపుణ్యాలను పొందడం ద్వారా మీ ఉద్యోగతను పెంచుకోండి. ట్విట్టర్ మరియు                లింక్డ్ ఇన్ లలో మీ గురించి మీరు బాగా ప్రచారము చేసుకోండి. ఇంటర్వ్యూ ను ప్రాక్టీసు చేయండి. ఒక కొన్ని ముఖ్యమైన వాక్యములలో ఒక మీ నైపుణ్యము గురించి మరియు మీరు ఎలాంటి అవకాశమును కోరుకుంటున్నారో తెలుపుతూ ఒక కథను అభివృద్ధిపరచండి. మీరు ఇంతకు ముందు ఎలాంటి హోదాలు వున్న పనులు చేసారని చెప్పుకొనడము కంటే ఎలాంటి పని చేయడానికి ఇష్టపడుతున్నారో అనేదాని పైన దృష్టి ఉంచమని మీకు మేము సిఫార్సు చేస్తున్నాము. మీ ఉద్యోగాన్వేషణలో నెట్వర్కింగ్ అనేది ఒక ముఖ్యమైన భాగము. మీరు బయటకు వెళ్లి మీ పరిశ్రమలో లేదా మీరు ఇష్టపడే కొత్త పరిశ్రమలో పనిచేస్తున్నవారిని కలవండి. తరువాతి అవకాశము ఎక్కడ ఉన్నదో మీరు ఎన్నడూ తెలుసుకోలేరు.

ఒక వృత్తిపరమైన గ్రూపులో చేరండి – మీరు ప్రతి రంగములోనూ అసోసియేషన్ లను చూస్తారు. పనిచేసే మహిళల మద్దతు గ్రూపులు సలహాల విషయములో చాలా తోడ్పడతాయి. మీరు ఎంత కాలము క్రిందట మీ చదువు పూర్తి చేసుకోన్నప్పటికీ, మీతో చదువుకొన్న వారితో కూడిన అసోసియేషన్ లో చురుకుగా వుండండి – ఇది ఒక గొప్ప వనరు.

మీ ఉద్యోగమును వదిలి వేయడము మీకు ఏంతో కష్టముగా వుండినది, అదే విధంగా దానిని పునఃప్రారంభించడము కూడా అంతే కష్టము. ఇప్పుడు మీరు మరింత పెద్దవారు మరియు తెలివైనవారు మరియు బలమైనవారు. ప్రపంచం మీరు మీ పునః ప్రారంభానికి ఎదురు చూస్తూ వున్నది!

మీకు కూడా ఒక ‘ఉద్యోగానికి తిరిగి వెళ్ళడం’ అనే కథ వుందా? దానిని మాతో పంచుకోండి!


15234411331523441133
Jayanthi


Share the Article :