భారత ప్రభుత్వపు కార్మిక చట్టాల రద్దు గురించి మీరు తెలుసుకొనవలసిన విషయాలు

Last updated 19 Mar 2018 . 1 min readIndian labour laws for termination Indian labour laws for termination

‘ఉద్యోగుల కొరకు రద్దు నియమాలు” అనేది ఏ ఉద్యోగికైనా ఒక భయపెట్టే పదము. ఒక ఉద్యోగి జీవనాధారము వారి ఉద్యోగము పైన మరియు వారి సంపాదించే నెల జీతము మీద ఆధారపడి వుంటుంది. అటువంటి సమయములో వారి జీవనాధారమే తీసుకోబడితే, వారి జీవితములో చీకటి కమ్ముకుంటుంది. అయితే ఉద్యోగము నుండి తీసివేయడము అనేది పలు కారణాల పైన ఆధారపడి వుంటుంది మరియు ఒక కంపెనీ ఆ పని చేయడానికి తగిన కారణము చూపించవలసి వుంటుంది. అదృష్టవశాత్తూ, విదేశాలలో ఉన్నట్లుగా పనిలోనికి తీసుకొనడము మరియు బయటకు పంపించి వేయటము అనే సిద్ధాంతము మన దేశములో లేదు, అందువలన ఇండియాలో నోటీసు లేకుండా ఉద్యోగమునుండి బర్తరఫ్ చేసే అవకాశము లేదు. యజమానులు చట్టము క్రింద ఒక ఉద్యోగి యొక్క సేవను రద్దు చేయాలని అనుకొన్నప్పుడు కొన్ని పద్దతులు పాటించవలసి వుంటుంది మరియు కొన్నిసందర్భాలలో వారికి పరిహారము కూడా ఇవ్వవలసి వుంటుంది. వారు బర్తరఫ్ చేయాలనుకున్నప్పుడు ఇండియన్  కార్మిక నియమాలను పాటించవలసి వుంటుంది.

 

ఈ ఆర్టికల్ లో, మేము సేవ యొక్క రద్దు మరియు దానికి సంబంధించిన ఆర్ధిక చెల్లింపుల అర్హత  కొరకు పద్దతి మరియు విధానమును ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాము.

 

‘కార్మికుడు మరియు కార్మికుడు కాని వాడు’

ఇండియాలో ఉద్యోగులను కార్మికుడు లేక కార్మికుడు కానివాడు అని వర్గీకరణ చేయడము సాధారణంగా జరుగుతున్నది. వర్క్ మాన్ అనే పదము పారిశ్రామిక వివాదాల చట్టము , 1947 ( “ఐ డి చట్టము) క్రింద నిర్వచించబడినది, మరియు అనగా ఏదైనా పరిశ్రమలో పనిచేసే అందరు వ్యక్తులను కార్మికుడు అంటారు కానీ నిర్వహణ, పరిపాలన లేక సూపర్వైజరి స్థాయిలలో ఉన్నవారికి ఇది వర్తించదు. ఐడి చట్టము క్రింద వున్న నిర్వచనం కాకుండా  కార్మికుడు మరియు కార్మికుడు కానివాడు మధ్య తేడాలను గుర్తించే సూత్రాలు ఏమీ లేవు. వ్యక్తి చేస్తున్న పనిపై ఆధారపడి వివిధమైన తీర్పుల పరంగా ఇది ఏర్పడినది. కార్మికుడుగా పరిగణించబడిన ఉద్యోగి ఐడి చట్టము క్రింద పాలించబడతాడు మరియు అతనిని ఉద్యోగము నుండి బర్తరఫ్ చేయడము అనేది ఐడి చట్టము నిబంధనల ప్రకారముగా జరగాలి.

 

ఉద్యోగము నుండి బర్తరఫ్ చేయడంలో రకములు

పని నుండి బర్తరఫ్ చేయడము అనేది దుష్ప్రవర్తన వలన, పనులు తగ్గడము వలన సంభవిస్తుంది.

 

దుష్ప్రవర్తన

దుష్ప్రవర్తన వలన ఒక ఉద్యోగిని తొలగించవలసి వచ్చినపుడు యజమాని క్రమశిక్షణా విచారణలు జరుపవలసి వుంటుంది. ఇండియాలో ఒక ఉద్యోగిని పని నుండి తీసి వేయదలచుకుంటే చట్టము క్రింద ఒక క్రమశిక్షణ విచారణ జరుపవలసి వుంటుంది. దీనిలో ఒక క్రమశిక్షణ ప్యానల్ ను ఏర్పాటు చేయవలసి వుంటుంది, తప్పు చేసిన వ్యక్తికి ఒక షో కాజ్ నోటీసు  జారీ చేయాలి మరియు అతడు తన వాదనను చెప్పుకోడానికి తగినంత సమయము ఇవ్వాలి. విచారణ సహజ న్యాయమును దృష్టిలో వుంచుకొని ఒక మంచి పద్దతిలో జరగాలి.

 

కొన్ని కేసులలో క్రమశిక్షణ ప్యానల్ జరిపిన విచారణలో ఎలాంటి నోటీసు లేకుండా మరియు ఎలాంటి పరిహారము చెల్లించకుండా ఆ వ్యక్తిని బర్తరఫ్ చేయవలసి వస్తుంది. చట్టము క్రింద, దుష్ప్రవర్తన అనే పదం దుష్ప్రవర్తనకు దారితీసే పరిస్థితులు మరియు సంఘటనల యొక్క ఒక జాబితాను అందిస్తుంది. ఈ పట్టిక లో యజమానులు తమ వ్యాపారములకు  తమకు అవసరమనుకొన్న తమ కంపెనీ యొక్క సిద్ధాంతాలు/ సర్వీస్ రూల్స్ మరియు ఇతరమైన వాటిని చేర్చవచ్చును. దుష్ప్రవర్తనలో ఉద్దేశపూర్వక అవిధేయత లేక అతిక్రమణ; దొంగతనము, మోసము లేక అవిశ్వాసము. కావాలని యజమాని యొక్క ఆస్తులను ధ్వంసము చేయడము, నష్టపరచడము; లంచము తీసుకొనడము; అలవాటుగా ఆలస్యముగా రావడము లేక హాజరు కాకపోవడము; చట్టవిరుద్ధంగా కొట్టడము మరియు లైంగిక వేధింపు వంటివి కూడి వుంటాయి.

 

పైన చెప్పబడిన బర్తరఫ్ చేసే పద్దతి కార్మికుడు లేక కార్మికుడు కానివారలకు అందరికీ వర్తిస్తుంది.

 

పని నుండి పంపివేయడము

కార్మికుడు కాని వారిని ఉద్యోగముల నుండి తొలగించేందుకు వారు పని చేస్తున్న రాష్ట్రము యొక్క  ఉద్యోగ ఒప్పందములోని నోటీసు వ్యవధి మరియు దుకాణాలు మరియు సంస్థల చట్టము ( S & E) పైన ఆధారపడి వుంటుంది. సాధారణంగా, రాష్ట్ర ఎస్&ఇ బర్తరఫ్ చేయడానికి ముందు కనీసము ఒక నెల నోటీసు ఇస్తుంది లేక రద్దుకు బదులుగా చెల్లిస్తుంది, మరికొన్ని సందర్భాలలో బర్తరఫ్ చేయడానికి ఒక కారణము అవసరము వుంటుంది. ఉద్యోగ ఒప్పందము క్రింద బర్తరఫ్ యొక్క నోటీసు అనేది చట్టము క్రింద తెలిపినదాని కంటే తక్కువ అనుకూలమైనదిగా వుండకూడదు.  

 

ఉద్యోగుల సంఖ్యను పరిమితి చేయడము (రిట్రెంచ్మెంట్)

సంఖ్యను పరిమితి చేయడము అనే విషయములో ఐడి చట్టము కొన్ని దశలను ఏర్పాటు చేసినది. ఉద్యోగుల సంఖ్యను పరిమితి చేయడము అనే పదం యజమానిచే ఒక కార్మికునిని క్రమశిక్షణా కారణాల వలన కాకుండా, కొన్ని మినహాయింపులతో ఏదైనా కారణముచే పని నుండి తొలగించడంగా నిర్వచించబడింది.

 

ఒక యజమాని ఒక కార్మికునికి ఉద్యోగ పరిమితిని చేయాలనుకొన్నప్పుడు, అతడు అంతరాయము లేకుండా ఒక సంవత్సరము కంటే ఎక్కువ కాలము  పని చేసివుంటే, అతనికి ఒక నెల నోటీసు ( ఉద్యోగ పరిమితి చేయడానికి కారణాలు చూపుతూ) ఇవ్వవలసి వుంటుంది, లేదా కార్మికునికి అలాంటి నోటీసు జారీ చేసినందువలన చెల్లింపులు చెల్లించవలసి వుంటుంది. యజమాని పనివారల తొలగింపుకు సంబంధించిన సమాచారమును తమ ప్రాంతములో వున్న కార్మిక శాఖ అధికారులకు నిర్ణయించిన సమయములోపల తెలియచేయాలి.

 

ఉద్యోగ పరిమితి పరిహారము కొరకు నియమాలు

అదనంగా, యజమానులు ఒక ప్రత్యేక కారణము వుంటే తప్ప పని నుండి తొలగింపుకు చివర వచ్చినవారు – మొదట బయటకు పోవడము అనే పద్దతిని పాటించాలి. పనిలో నుండి తొలగించబడిన కార్మికుడు ఐడి చట్టము నియమాల క్రింద పరిహారమును పొందుటకు అర్హుడై వున్నాడు, దీనిని అతడు నిరంతరంగా పని చేసిన ఒక సంవత్సరానికి 15 రోజుల చొప్పున లెక్కించాలి. నూరు మంది కంటే ఎక్కువ పని చేసే కొన్ని సంస్థలు ( ఫ్యాక్టరీలు, గనులు, ప్లాంటేషన్లు) వారిని పని నుండి తొలగించాలని అనుకొన్నప్పుడు వారిని పని నుండి తొలగింపునకు కారణాలు తెలుపుతూ వారికి మూడు నెలల ముందుగా వ్రాతపూర్వక నోటీసు ఇవ్వాలి లేదా అంత మొత్తమును చెల్లించాలి. ఇంకా పని నుండి తొలగించాలని అనుకొన్నపుడు సంబంధిత ప్రభుత్వ అధికారుల నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి.

 

కార్మికునికి రావలసిన అన్ని బకాయిల చెల్లింపు

ఒక ఉద్యోగిని అతని పని నుండి అతనిని తొలగించినపుడు, యజమాని తొలగింపు సమయమునకు అతనికి చెల్లించవలసిన మొత్తములన్నియు చెల్లించాలి . అలాంటి కొన్ని మొత్తాలు క్రింద ఇవ్వబడ్డాయి:  

 

1. నోటీసు లేకుండా తీసివేసినపుడు నోటీసు చెల్లింపు.

 

2. పని నుండి తీసివేసిన నెలలో అతడు పని చేసిన రోజు వరకు అతను పని చేసినా చెల్లించని రోజులకు జీతం చెల్లించాలి.

 

3. గ్రాట్యూటి చట్టము 1972 నియమాలకు సంబంధించి కనీసము 5 సంవత్సరముల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు గ్రాట్యూటి చెల్లించాలి. ఈ చట్టము 10 అంతకంటే ఎక్కువ ఉద్యోగులు వున్న సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ గ్రాట్యుటి ఉద్యోగి పూర్తి చేసిన ప్రతి ఒక సంవత్సరమునకు 15 రోజుల చొప్పున లెక్కగట్టి చెల్లించబడుతుంది.

 

4. బయటకు వెళ్ళే ఉద్యోగి తన ఖాతాలో జమచేసి వాడుకోకుండా వున్న సెలవులను సంస్థకు ఇచ్చివేసి దానిని నగదుగా మార్చుకోనడము;

 

5. చట్టప్రకారము చెల్లించవలసిన బోనస్, ఉద్యోగి దానికి అర్హుడైతే చెల్లించవలసి వుంటుంది. బోనస్ చట్టము, 1965 క్రింద ఒక సంస్థలో రూ.10000/- వరకు సంపాదించే మరియు ఒక సంస్థలో ఒక ఆర్థిక సంవత్సరములో 30 రోజులు ఆపైన పని చేసిన ఉద్యోగులకు ఈ చట్టము వర్తిస్తుంది.  

 

6. పని తొలగింపు పరిహారము, ఉద్యోగి కార్మికుడు అయి మరియు అతను పని నుండి తొలగించబడినపుడు ఇది వర్తిస్తుంది.

 

7. యజమాని మరియు ఉద్యోగి మధ్య ఒప్పందము చేసుకున్న ఇతర బకాయిలు లేక ఆ కంపెనీ సిద్ధాంతాల ప్రకారము చెల్లించవలసిన చెల్లింపులు.

 

8. ఉద్యోగి ఖాతాలో జమచేయబడిన ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను పొందటములో దరఖాస్తు చేయడములో  ఉద్యోగికి సాయపడవలెను.

 

అతనికి ఇతర బకాయిలు కూడా రావలసి ఉండవచ్చును మరియు అవి ఉద్యోగము బట్టి మారుతూ వుంటాయి. పైన వ్రాయబడిన ఆర్టికల్ బర్తరఫ్ చేయడములో వున్న వివిధ పద్దతుల గురించి మరియు పని తొలగింపు సమయములో ఉద్యోగికి రావలసిన చెల్లింపు గురించి అర్థం చేసుకోవడానికి ఒక సంక్షిప్త వ్యాసం. అయితే ప్రతి రద్దు సందర్భంను వేరువేరుగా స్వతంత్రంగా చూడాలి.


15211130191521113019
SHEROES
SHEROES - lives and stories of women we are and we want to be. Connecting the dots. Moving the needle. Also world's largest community of women, based out of India. Meet us at www.sheroes.in @SHEROESIndia facebook.com/SHEROESIndia


Share the Article :