ఇంటి కోడలు మరియు ఆమె హక్కులు!
ఈ మధ్యనే గౌరవనీయమైన భారత దేశపు అత్యున్నత మైన న్యాయస్థానము సుప్రీంకోర్టు భార్యను ఇంటి నుండి గెంటి వేసి ఆమెను ఆత్మహత్య చేసుకొనేలా పురిగొల్పిన విషయములో ఆమె భర్తకు శిక్ష విధిస్తూ అన్నారు, ‘ఒక ఇంటి కోడలిని ఆమెను ఆ కుటుంబములోని ఒకరిగా చూడాలి గాని పని మనిషిగా కాదు ‘ మరియు ఎటువంటి పరిస్థితులలోనూ ఆమెను గెంటి వేయరాదు’ అని.
“ఒక కోడలిని ఆమె అత్తగారింట్లో ఆమె భర్త, అత్తమామలు మరియు బంధువులు చూసుకోనే పద్దతి వలన ఆమె సంఘములో ఆత్మీయతను కోల్పోతుంది.”
ఒక వివాహిత తనను మెట్టినింటి వారు తనను తమ కుటుంబములోని వ్యక్తిగా చూడకుండా వేరుగా చూసిన పక్షములో ఆమెలో ఒక అభద్రతా భావము వుండి పోతుంది. తనను తన మెట్టినింటి వారు ఎపుడైనా బయటకు వెళ్ళగొడతారనే ఒక అస్పష్టమైన భయము ఆమెలో ఉండిపోతుంది; మన దేశములో పెళ్లి చేసుకోనడానికి కనీస వయస్సు అబ్బాయికి 21 సంవత్సరములు అమ్మాయికి 18 సంవత్సరములు ఉండటము వలన పెళ్లి చేసుకొనే సమయములో పెళ్లి కుమారుడు కంటే పెళ్లి కూతురు చిన్నదిగా వుండాలని తన వయసుతో సమానంగా లేదా పెద్దదిగా వున్న అమ్మాయిని చేసుకోన రాదనే ఒక ఆలోచన ఏర్పడింది. తమ పెద్దల ఆస్థి పొందే హక్కు విషయములో కొడుకు మరియు కూతురు ఇద్దరూ ఒక తల్లి పిల్లలయినా మనము తేడా చూపించడములో మన అవివేకత బయటపడుతుంది. ఈ విషయములో స్రీలను పౌరులుగా కంటే వారిని కాపాడడానికి అధికారుల దగ్గర ఒక రక్షణ కవచము వుండాలి. ఇంటి కోడళ్ళ కొరకు ఇన్ని రకాలైన చట్టాలు చేసి ఉంచిన మన న్యాయవ్యవస్థకు నిజంగా మనము ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే అది నిజంగా మహిళలపై జరిగే అత్యాచారాలు ఆపలేక పోయినప్పటికీ వీటిలో చాలా వాటి నుండి రక్షణ కల్పిస్తూ వున్నది. కొన్ని శతాబ్దాల నుండి అణచి వేయబడిన స్రీ మూర్తులకు రాబోయే కష్టాలు ఇబ్బందులు ఊహించుకొని మన రాజ్యాంగ నిర్మాతలు ఈ చట్టాలు తెచ్చి ఉండవచ్చును. అందువలననే ఆర్టికల్ 15 (3) భారతీయ చట్టము రాష్ట్రమునకు ఓ యింటి కోడలి పక్షంగా ఒక నిశ్చయాత్మక చర్య తీసుకొనడానికి వారికి అధికారము ఇచ్చినది. నిజంగా అమ్మాయి అబ్బాయి పట్ల లింగ వివక్ష లేకుండా మరియు వారి సమానతకు బాగా జాగ్రత్త పడిన రాజ్యాంగాలలో మన భారత రాజ్యాంగము ఒకటి.
ప్రతి వివాహిత తెలుసుకొనవలసిన కోడళ్ళ గురించిన కొన్ని ముఖ్యమైన చట్టాల క్రింద ఇవ్వబడ్డాయి.
#1. స్రీ ధనము
హిందూ చట్టము ప్రకారము స్రీ ధనము ఆమె పెళ్లి ముందు / పెళ్లి సమయములో మరియు ఆమె చిన్న తనములో పొందినవి ( బహుమతులు, స్థిర చరాస్తులు కలుపుకొని ) అని అర్థము. ఆమెకు వాటి మీద శాశ్వత హక్కులు ఉన్నవని మరియు ఆమె తన భర్త నుండి వేరుపడిన తరువాత కూడా వాటిని పొందే హక్కును ఆమె కలిగివున్నారని సుప్రీం కోర్టు పేర్కొన్నది. అది తిరస్కరించబడితే ఆమె భర్త మరియు అత్తమామలు క్రిమినల్ చర్యలను ఎదుర్కొనవలసి వస్తుందని తెలిపినది. ఒక వేళ అత్తగారు కోడలి యొక్క స్రీ ధనమును తన దగ్గర వుంచుకొని వీలునామా లేకుండా చనిపోతే ఆ స్రీ ధనము పైన కోడలికి మాత్రమే చట్ట పరమైన హక్కు వుంటుంది కాని భర్తకు గాని ఇతర కుంటుంబ సభ్యులకు గాని హక్కు వుండదు. జీవితాన్ని సులభతరము చేసుకొనేందుకు మహిళ ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.
- ప్రతి కోడలు తన పెళ్ళిలో బహుమతులకు సంబంధించి పెళ్లి సమయములో తీసిన ఫోటోల రూపములో సాక్ష్యాలను తన దగ్గర ఉంచుకోవాలి .
- ప్రతి కోడలు తన పెళ్లి సమయములో పొందిన బహుమతులు చరాస్తులు ( నగలతో కలుపుకొని) వీటికి సంబంధించి సాక్ష్యాలను/ వాంగ్మూలాలను ఉంచుకోవాలి.
- స్త్రీ ధనము ఉపయోగించి చేసిన పెట్టుబడుల గురించి రికార్డులను నిర్వహించుకొనడము మరియు అవి మహిళ తన పేరట ఉండేలా చూసుకొనడము.
#2. గృహ హింస:
ఒక మహిళ భర్త వలన లేక అతని ఇంటి సభ్యుల వలన గృహ హింస చట్టము క్రింద విడాకులు పొందటమే కాకుండా ఆమె భర్త అమెకు ఎలాంటి ఇబ్బందులు పెట్టనని లేక మంచి ప్రవర్తనతో ఉంటానని భర్త నుండి కలెక్టర్ గారి ద్వారా ఒక బాండు అనుకూలత పొందే అవకాశము వుందని కొద్ది మందికి మాత్రమే తెలుసు. భర్తను జామీను క్రింద కొంత డబ్బు లేక ఆస్థి ఉంచమని కూడా అడగవచ్చును ఎందుకంటే అతడు క్రూరంగా ప్రవర్తించినపుడు అతను జామీను క్రింద ఉంచిన మొత్తమును కోల్పోతాడు. ఈ క్రింద పేర్కొనబడిన శారీరక, లైంగిక, మానసిక, మాటల మరియు భావోద్వేగ హింసలు గృహ హింస క్రిందకు వస్తాయి:
- నిరంతరంగా ఆహారము ఇవ్వకపోవడము.
- ఇతరులతో సెక్స్ సంబంధాలు లేవని నిరూపించు అనడము
- ఆమెను నిరంతరంగా ఇంటి బయట ఉంచడము
- స్రీని తన పిల్లలకు దూరంగా ఉంచడము, తద్వారా ఆమెకు మానసిక వేదనను కలిగించడము
- శారీరకంగా ఆమెను హింసించడము
- సాధించటము, నైతిక బలాన్ని కోల్పోయేలా చేయడము మరియు స్రీని మానసికంగా హిసించేందుకు కించపరచి మాట్లాడటము.
- స్రీని ఇంటిలో బంధించి బయటి వారితో మాట్లాడకుండా చేయడము
- స్రీ కి బాధ కలిగించాలనే ఉద్దేశ్యముతో ఆమె సమక్షములో పిల్లలను తిట్టడము
- కట్నము ఇవ్వకుంటే విడాకులు ఇస్తాను అని భయ పెట్టడము
#3. అత్తవారిల్లు:
హిందూ స్వీకరణ మరియు నిర్వహణ చట్టము 1956 ప్రకారము ఒక పెళ్ళైన యువతి అత్తవారింట్లో నివాసము వుండాలి, అది తన స్వంతము కాక పోయినా సరే. అత్తవారిల్లు అనగా భర్తకు స్వంతమయినది లేదా అతడు నివసించేది. భర్తకు తన భార్యకు మరియు పిల్లలకు స్వంత మయినా లేక బాడుగ ఇల్లు అయినా తానుండక పోయినా వారికి ఏర్పాటు చేయవలసిన ధర్మము వున్నది. భార్యా భర్తల మధ్య కలహాల వలన భర్త తాను ఉంటున్న బాడుగ ఇల్లు గాని లేక తను పని చేస్తున్న సంస్థ సమకూర్చిన ఇంటిని వదలి వెళ్లి పోయే పరిస్థితులలో కూడా తన భార్యా పిల్లలకు అవసరమైన తిండి, బట్ట, నివాసము, విద్య మరియు ఆరోగ్య రక్షణకు అవసరమైన వసతులు సమకూర్చడము, మరియు పెళ్లి కాని ఆడ పిల్లలు వుంటే వారి పెళ్ళికి అవసరమైన డబ్బును సమకూర్చవలసిన భాద్యతలనుండి తప్పించుకొనలేడు.
#4. పుట్టినిల్లు:
సుప్రీం కోర్టు చెప్పినది ఏమంటే తండ్రి తన కోఆపరేటివ్ సొసైటీ ఫ్లాటును తన తదనంతరము ఇతర కుటుంబ సభ్యులకు కాకుండా తన కూతురిని నామినీ గా ఉంచే హక్కు కలిగి వున్నారు. కోర్టు “నియమాలకు అనుగుణంగా ఒక కో ఆపరేటివ్ సభ్యుడు ఒక వేళ తను మరణము తరువాత తన భాగపు ఆస్తిని నామినీ పేరట బదిలీ చేయమని కోరవచ్చును. ఈ వంశ పారంపర్యములో లేక వారసత్వ విషయములో ఇతరుల హక్కు నామమాత్రమే” అని పరిశీలించింది
అదనంగా , తండ్రి గారు ఎలాంటి వీలునామా వదలి పెట్టకుండా చనిపొతే కుమారులతో పాటు కూతుర్లకు గూడ తమ పెద్దల ఆస్థి పొందే హక్కు వున్నది. తల్లిగారి ఆస్తిలో కుమార్తెలకు కూడా భాగము వున్నది.
నేను ఈ పరిస్థితులలోనికి ఏ స్రీ కూడా వెళ్ళకూడదని, పై నియమాలను వాడుకొనే అవసరము రాకూడదని నేను దేవుణ్ణి వినయంగా ప్రార్థిస్తూ వున్నాను, కాని ఈ విషయము పై మీ పరిజ్ఞానము ఇతరులు ఈలాంటి అననుకూల పరిస్థితిలోనికి వెళ్ళకుండా చేయడములో మీకు ఉపయోగపడవచ్చును