హోంమేకర్స్ గృహిణిలు : ఒకే నాణెంనకు రెండు ముఖాలు
నా చిన్ననాటి జ్ఞాపకాలలో నా తల్లి ఇంటిలో కష్టపడటము మరియు నా తండ్రి పనికి
పోవడానికి తయారు అవుతుండటము ఇవి అన్నియు కలసి వున్నాయి. ఇలాంటి కుటుంబ
ఏర్పాటు నేను పెరుగుతున్నప్పుడు ఒక సాధారణ విషయము, చాలా కుటుంబములో సంపాదన
చేసే వారు తండ్రి మరియు గృహిణిగా అన్ని పనులు చక్కబెట్టేవారు తల్లులు
అయివుండేవారు. ఇందువలన సహజంగా నా తండ్రి మానేజర్ మరియు నా తల్లి గృహిణి గా
చెప్పబడుతుండేది. సాధారణంగా ప్రజలు నా తల్లితండ్రుల గురించి అడిగినపుడు , నేను
నా తండ్రి అఫీసులో తన స్థానాన్ని గురించి గొప్పగా చెప్పుకొంటూవుండి, నా
తల్లి విషయము వచ్చేసరికి నేను కొంచెము పెనుగులాడి చిన్న గొంతుకతో ఆమె ఒక
గృహిణి అనే చెప్పేవాడిని. నేను ఇబ్బందిపడడం వలన కాదు.
“గృహిణి” అనే పదమును తప్పు అర్థంలో తీసుకుంటున్నారు. ఆ వయసులో నేను
గ్రహించినంత వరకు ఆమె నా తండ్రి భార్య కాని ఇంటికి కాదు. అందువలన ఆ పదము
నన్ను కలవరపెట్టినది.
నేను పెరుగుతున్న కొద్ది నా గందరగోళం ఒక ఆవేదన గా మారింది. నా తల్లి ఈ
అల్పత్వాన్ని ఎలా అంగీకరించింది? ఆమె ఇతరుల భార్య అని ఎలా అంగీకరించగలిగినది?
ఇది ఆమె వ్యక్తిత్వాన్ని చంపివేయదా? నిజాన్ని అనిశ్చిత పడక, ఇది ఆమెను కూడా
గాయపరుస్తుందో లేదో తెలీదు కాని , నేను వేరే ఏమీ చేయలేక పోయాను, ఆమెను
గృహిణిగా పిలవకపోవడము తప్ప.
తరువాతా నా వృత్తిపరమైన జీవితములో, పిల్లలు తమ తల్లిని ఇంకా “గృహిణినులు”గా
పిలిచినపుడు నేను ఆశ్చర్యపడ్డాను ఇంకా ఏమీ మారలేదు అని. ఇంటి పనులు చేసే
తల్లులు చెల్లింపబడని పనివారుగా ఒక పెద్ద భాగముగా వున్నారు. మన కుటుంబాలలో
జాగారూకతతో ప్రతిదినము పగలూ రాత్రి వంటగదిలో వండటము మరియు వేడి వేడి తాజా
ఆహారము మనకు వడ్డించే వారి గురించి రెండవ సారి ఆలోచించము. మన పరుపులను మరియు
పడక గదులను చూడడం మరియు నిర్వహించడము, ఇంటిని పరిశుభ్రంగా ఉంచడము చేస్తూ
వుంటారు. అయిననూ ఏవిధంగా కూడా వారికీ ధన్యావాదాలు చెప్పము.
గృహిణి అనే పదము గురించి నేను నా ఆలోచనలను నా స్నేహితులతో మరియు
పరిచయస్తులతో పంచుకొన్నప్పుడు, చాలా మంది నాతొ ఏకీభవించారు. వారు నిజంగా తమ
తల్లులు, భార్యలు, అక్కచెల్లెళ్ళు మరియు కూతుర్లు వీరి పట్ల క్రుతఘ్నులమై
లేమని ఏమాత్రము ఆలోచించకుండా ఒప్పుకొన్నారు.
మన వైఖరిలో ఒక చెప్పుకోదగ్గ మార్పు రావాలని నేను కోరుకొంటూవున్నాను మరియు
ఇంటి పనులు చేసే ఆడవారిని గృహిణి కాదు, హోం మేకర్ అని పిలిచే ఆ పదముగా మార్పు
చేయడము ద్వారా మొదలు కావాలి.
గృహిణి మరియు హోమ్ మేకర్ దాని వాడకములో మరియు ఉపయోగములో చెప్పుకోతగ్గ
తేడా వున్నది. దాని వాడకములో కాకుండా దాని కూర్పు విషయములో ఒక తప్పు వున్నది.
ఆక్సఫర్డ్ డిక్షనరీ ప్రకారంగా , ఒక గృహిణి అనగా వివాహము కాబడిన స్రీ , మరియు
ఆమె ప్రధాన కార్యము తన కుటుంబమును జాగ్రత్తగా చూసుకొనడము, ఇంటికి
సంబధించిన విషయాలు మరియు ఇంటి పని చేయడము ఆమె పనులుగా వున్నాయి.
గృహిణి పదమునకు ఒక సమాంతరమైన పదము, లేక అందరూ అమోదించబడి పదము హోమ్
మేకర్. దీని వలన ఆమెకు ఇప్పటికి ఎక్కువ భాద్యతలు కలవవు. గృహిణి / హోమ్ మేకర్
వీరి భాధ్యతలకు అంతులేదు. ఇంటి నిర్వహణను చూసే ఆమెను శక్తి వంతమైన ఎత్తుకు
తీసుకొని వెళ్ళడము వలన ఆమె యొక్క అన్ని రకాల మర్యాదలను మరియు
వ్యక్తిత్వాన్ని పెంచుతుంది.
ఒక స్రీ ఒక ‘ఇంటి’ని ‘గృహము’గా మార్చడము కొరకు తన చెమట, రక్తము మరియు తన
జీవితము కూడా ధారపోస్తుంది. ఆమె ఒక కుటుంబాన్ని ‘ సుఖసంతోషాలకు నిలయమైన
ఇల్లుగా సృష్టిస్తుంది.’ ఒక యింటిని సృష్టించడము , కుటుంబాన్ని, పిల్లలను
మరియు బంధుత్వాలను పెంచడము, మనకోసము మనది అనే ఒక స్థలము సృష్టించడము, ఇది
నిజంగా మెచ్చుకోదగ్గ చర్య అని చెప్పవచ్చును.
కాలాంతరంగా హౌస్ వైఫ్ ను హోం మేకర్ తో మార్చే విషయ చర్చపై మంట రేగినది.
ఇది ప్రశ్నించడానికి తార్కికముగా కనబడవచ్చును, ఆమెను హౌస్ వైఫ్ అనకుండా
హోమ్ మేకర్ అని అనడము వలన ఇంటి పనులు నిర్వహిన్స్తున్న స్రీ పట్ల మన
అభిప్రాయము మారడానికి దారి తీస్తుందా అని. 50:50 అవకాశాలు వున్నాయని
ఒప్పుకొన్నారు!
లేబుల్స్ మారుతున్నాయి. కాని మనము మనల్ని ఈ విధంగా వివరించాలని
అనుకొన్నప్పుడు, మనము ఒక వ్యక్తిని అతని పూర్తి శక్తీ సామర్థ్యాలను
వివరించే విధంగా ఆవరించి వున్న ఒక పదమును ఎన్నుకోవాలి.
దీని ప్రభావము కలవరము నుండి చాలా మంది మంచి కుర్రాళ్ళకు బయటపడటానికి
సహాయము చేస్తుంది. మరియు దీని ప్రభావమును అర్థము చేసుకొనడానికి నాకు
పదిహేను సంవత్సరాలు పట్టినది.