మన దేశంలో ఫెయిర్నెస్ ను అతిగా అభిమానిస్తారు
నేను ఇక్కడ న్యాయబద్ధంగా మరియు సరిగా ఉండాలనే తపన గురించి మాట్లాడటం లేదు.
నా ఉద్దేశ్యములో “ఫెయిర్” అనే పదమును ఒక లేత చర్మపు రంగును వర్ణించటానికి
మనము భారతదేశములో మాత్రమే ఉపయోగించే ఒక పద్ధతిలో వాడుతున్నాను.
జాతి పరంగా భారతదేశము ఒక ప్రత్యేకమైనది. మనము తెలుపు లేదా నలుపు కాదు. మనము
పూర్తిగా గోధుమ రంగులో కూడా లేము. చాలా తెలుపు నుండి (మీ చర్మపురంగును
వివరించడానికి భారతదేశములో మాత్రమే ఉపయోగించే ఒక ప్రత్యేక పదము) గోధుమరంగు
(భారతదేశంలో ఉపయోగించే మరొక పదము) నుండి నలుపు వరకు చర్మపురంగులోని
భిన్నత్వము మరియు వైవిధ్యము సంఘములో తీవ్రమైన పక్షపాతములను మరియు
వివక్షతలను కలుగజేసింది, ఇంకా ముఖ్యముగా మహిళలు ఈ వివక్షతను ఎదుర్కొంటున్నారు.
ఈ విషయములో మన భారతీయ సాంప్రదాయము ఎక్కడవుందో తెలుసుకోవడానికి మీరు ఏదైనా
వార్తాపత్రికల పెళ్లి సంబంధాల విభాగములో వధువు కావలెను అనే ప్రకటనను చదవండి
ఫెయిర్నెస్ క్రీం కొరకు ఇచ్చే ప్రకటనలలో చట్టవ్యతిరేకమైన వివాహ విపణిలో
ఖచ్చితముగా ఒక మంచి రంగు ఉంటేనే జీవితము విజయవంతమవుతుందని చెపుతారు, అందువలన
తల్లిదండ్రులు మరియు సమాజము అమ్మాయి మంచి రంగులో వుండాలి అని ఆశపడటములో
ఆశ్చర్యమేమీ లేదు.
ఈ ఫెయిర్నెస్ క్రీము యొక్క మూలాలు, మంచి రంగు కొరకు తపన, ఎలా వున్నయంటే మీరు
ఉన్నట్టుగా మిమ్మల్ని మీరే ఒప్పుకోరు మరియు పౌడరు మరియు ఫెయిర్నెస్ క్రీము
లేకుండా ప్రపంచముతో సంబంధాలను కలిగి ఉండలేమనిపిస్తుంది. ఇది తక్కువ
ఆత్మగౌరవము మరియు తనను తాను ఒప్పుకోనుటకు ఇష్టపడని అసమర్థత ను సూచిస్తుంది.
ఇది ఒక్క రోజులో జరిగినది కాదు. ఇది అమ్మాయిలలో వారి చిన్నతనము నుండి మరియు
పెరుగుతున్న వయస్సుతో రోజు రోజుకు పెరుగుతూ వున్నది. మనము మన పిల్లలని ఎలా
చూస్తున్నాము అనేది ఎంత ముఖ్యమో వారు పెద్దయ్యాక వారి ప్రవర్తనలో
తెలుస్తుంది.
కనీసము ఇప్పుడే పుట్టిన పాపాయిని కూడా వదలలేదు. పాపాయిని చూచుటకు వచ్చిన
పెద్దవయస్సు మహిళలు, పాపాయి ముఖమును దగ్గరగా చూసి ఇంకా తల్లితండ్రుల
అదృష్టమో లేక దురదృష్టమో తెల్ల లేక నల్ల అమ్మాయి అని చెబుతుంటారు. చిన్న
గ్రామాలలో మరియు గ్రామీణ ఉత్తర భారత దేశములో ఇది ముఖ్యముగా జరుగుతూ వుంది.
అమ్మలు మరియు అమ్మమ్మలు కొన్నిసార్లు అమ్మాయిలకు ఎండలో ఆడకండి నల్లగా
అవుతారు అని చెబుతుంటారు.
పిల్లలని వారి చర్మపు రంగును బట్టి తెల్లగా వున్న ఇతర పిల్లలని పొగుడుతూ వారితో
పోలుస్తూ అందముగా వుండాలని చెబుతారు. ఫెయిర్నెస్ కొరకు తపన ఇప్పుడు కొత్తది
కాదు. తెలుపు చర్మం కోసం తిష్ట వేసుకొని కూర్చున్న కోరికను సూచించే పురాతన
సూక్తులు ఉన్నాయి. అటువంటి ఒక ఉదాహరణ ఏమంటే మంచి రంగు ముఖములోని ఇతర 10
లోపాలను దాచేస్తుంది. రంగు వివక్షత అనేది లింగ వివక్షతను బట్టి వుంటుంది.
అబ్బాయి నల్లగా వున్నప్పుడు, అతను అందముగా ఉన్నాడు, కాని ఒక అమ్మాయి
విషయంలో తను ఎలా కనపడుతుంది అనేదే అంతా అవుతుంది. "అందం అంతా చర్మానిది మరియు
పుస్తకము కవర్ చూసి దాని గురించి తీర్పు చెప్పరాదు" వంటి భావాలను అమ్మాయిలకు
వాడరు. ఆకర్షణను బట్టి అమ్మాయిల అందమును నిర్ణయిస్తారు దానిలో మిగతావాటి
కన్నను మంచి రంగు అనేదానిమీదనే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. భారతదేశములో అందముగా
ఉండటమంటే తెల్లగా ఉండటము అనే దానికి సమాన అర్థం అయ్యింది, ఎందుకంటే ఇక్కడ
మంచిరంగును అతిగా అభిమానిస్తారు.
తెల్లగా పుట్టిన వారికి కూడా ఈ తపన లేదు అని కాదు. వారికి మరింత తెల్లగా ఉండాలని
అనుకుంటారు. అందముగా ఉండాలనే తపన తృప్తిపరచలేనిది. చాలామంది తెల్లగావున్న
అందమైన అమ్మాయిలు వారి ఫెయిర్నెస్ విలువను పెంచుకొనుటకు ఫెయిర్నెస్
ప్రొడక్ట్స్ ను వాడటము నేను చూసాను. ఒక యువ వధువు గురించి ఒకసారి నేను ఒక వివరణ
విన్నాను, ఆమె ఎంతో అందముగా వుండి గదిలో లైట్ లేనప్పుడు ఒక బల్బ్ లాగా
వెలుగుతూ వున్నది! భారతీయ సమాజములో ఫెయిర్నెస్ కి ఎంత ఖచ్చితమైన నిర్ణయము
ఉంటుందో మీరు ఊహించగలరా! ఈ విధమైన ఆలోచనా ధోరణి యువ భారతీయ బాలికలకు
నిజమైన నష్టమును కలిగిస్తూ అందము మరియు వారి గౌరవమునకు సంబంధించి సమాజ
విలువలని వారు పోగొట్టుకుంటున్నారు. తగినంత అందముగా లేరు అని చెప్పుట అనేది
వారిలో ఆత్మగౌరవము మరియు ఆత్మవిశ్వాసమును శాశ్వతంగా తగ్గిస్తుంది. వారిని
వారు ఎప్పటికీ ఒప్పుకునే పరిస్థితి వుండదు మరియు నిజంగా అవసరమయ్యే విషయాలైన
వారి యొక్క తెలివితేటలను, ప్రతిభను వృద్ధి చేసుకునే ప్రయత్నాలు చేయడానికి
బదులుగా వారి చర్మపు రంగును దాచుకొనుటకు ఫెయిర్నెస్ ప్రొడక్ట్స్ వాడుతూ వారి
జీవితాలకు నిజమైన తేడాలను కలిగిస్తున్నారు.
ఫెయిర్నెస్ ప్రొడక్ట్స్ ప్రచారం చేయడాన్ని వ్యతిరేకించే సెలబ్రిటీస్ని
నేను గౌరవిస్తాను. మనము మన చర్మపు రంగును మార్చలేమనే విషయము
చదువుకున్నవారెవరికైనా తెలుసు. అది మన జీన్స్ లో వున్నది. యామి గౌతమ్ లేక
అలియా భట్ వంటి సెలబ్రిటీస్ ఇటువంటి తప్పుదారిన పెట్టె ఫెయిర్నెస్ క్రీమ్
ప్రకటనలలో కనిపిస్తున్నారు. ఈ మహిళలు పుట్టుకతోటే మంచి రంగుతో వున్నవారు కానీ
ఈ ప్రొడక్ట్స్ వాడి తెల్లబడినవారు కాదు. వారికి తెలుసు అయినా వారు అంగీకరించి
ప్రకటనలతో ప్రభావితమయ్యే యువహృదయాలను తప్పుదారి పట్టిస్తున్నారు. వారు
ఈ ప్రొడక్ట్స్ ను ప్రచారం చేయటం లేదు, ఈ దేశములో తెల్లగా పుట్టడం ఒక
ప్రత్యేక అధికారం అనే నిజాన్ని వారు ప్రచారం చేస్తున్నారు. మరి నాకు అది
న్యాయముగా లేదు.