"నా సోదరి బలహీనంగా ఉన్నట్లు నేను ఎప్పుడూ భావించాను, నాది తప్పు"

Last updated 10 Apr 2018 . 1 min read



my strong sister my strong sister

పెరిగే కొద్ది, నేను ఎల్లప్పుడూ నా కవల సోదరి, మోనికా కంటే మెరుగైనదాన్ని అనుకుకునే దాన్ని. నేను ప్రతిసారి ఆమె కంటే ఎక్కువ మార్కులు సాధించాను, నాకు తనకంటే ఎక్కువ మంది స్నేహితులు వున్నారు మరియు నేను తనకంటే ముందే కెరీర్ ను ఏర్పరుచుకున్నాను. నేను స్కూల్ మరియు కాలేజ్ మొత్తంలో ఆమెను ఎలా రక్షించాను అనేది, ఆమె బలహీనంగా ఉండిందని మరియు తన కోసం తను పోరాడలేదని అనుకోవడం నాకింకా గుర్తుంది.

కొన్ని సంవత్సరాల తరువాత నాకు తెలిసింది, నాది తప్పు అని. కొన్ని సంవత్సరాల తరువాత మాత్రమే ఆమె బలం మరియు ఆమెలోని యోధురాలిని నేను చూశాను.

అక్టోబర్ 2015 లో, ఆమె నుండి నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆమె నాకు ఆ వార్తను చెప్పగానే, నేను కుర్చీలో కూలబడిపోయాను. ఇంకా అవతలి నుండి, ఒక స్పష్టమైన గొంతు నేను అనుకున్న లేదా ఊహించగలదాని కంటే చెడు వార్తను బలంగా మరియు స్థిరంగా నాకు చెబుతూ ఉండింది. "సరే, నా రిపోర్ట్లు వచ్చాయి. నాకు లుకేమియా ఉంది" అని ఆమె ధృడంగా చెప్పింది.

“ఏమిటి?” అని నా గొంతు బొంగురపోయినప్పుడు, ఆమె ఇలా ధైర్యంగా చెప్పడం కొనసాగించింది, అది ఒక అక్యూట్ మైయోలాయిడ్ ల్యుకేమియా, కెమోథెరపీ ద్వారా నయం చేయగల ఒక విధమైన క్యాన్సర్ రకం అని. నేను ఆమెను నమ్మాను. నేను మోనికా నుండి అలాంటి ధైర్యం ఊహించలేదు కానీ ఆమె అంత ప్రశాంతంగా అనిపిస్తే, ఆమె క్యాన్సర్ ఖచ్చితంగా నయం అయ్యేది అని నాకు అనిపించింది.

చికిత్స సమయంలో ఆమె ధృడత్వంను మరియు బలహీనతలను అవకాశాలుగా మార్చుకుంటున్న తన శక్తిని నేను చూసాను.

ఆమె కెమోథెరపీని వలన ఉపశమనం పొందింది. కానీ దురదృస్టవశాత్తు ఐదు నెలల లోపల, అయితే ఈసారి ఆ రాక్షసి మరింత తీవ్రతరంగా తిరిగి మేల్కొంది. ఏకైక చికిత్స  బోన్ మారో మార్పిడి మాత్రమే, ఇంకా వైద్యులకు కూడా నమ్మకం లేకుండింది.

అయినప్పటికీ మేము మార్పిడి కొరకు ముందుకు వెళ్ళాము, దానిలో భాగంగా నా తొడ కణాలను ఆమెలోనికి చొప్పించారు. చికిత్స సమయంలో, ఆమె మిగతా క్యాన్సర్ యోధురాలి వలె, ఆమె కూడా ప్రేరణ  మరియు ప్రోత్సాహం పొందే విషయాల కొరకు ఇంటర్నెట్ లో వెతికింది. కానీ ఆమె ఆశాభావంతో దాని వైపు వెళ్ళిన ప్రతీసారి, దాంట్లో తనకు కనపడినంతా భయంకరమైన రోగ నిరూపణ మరియు వ్యాధికి లొంగిపోయినవారి నిరుత్సాహకరమైన కేస్ స్టడీలు మాత్రమే;  క్యాన్సర్ రోగికి, మరియు వారి బంధువులకు, ఒక్క విజయవంతమైన కథ అయినా జీవితం అని అర్ధం.

ఒక్క ఆశ కూడా లేకుండడం ఆమెకు ఆదుర్దా కలిగించింది. కానీ, చాలా స్పూర్తిదాయకమైన ఆలోచనలు కష్టాల గర్భము నుండి పుట్టాయి. ఆమె తన మనసులో భయానికి బదులుగా ఆశకు చోటివ్వాలని నిర్ణయించుకుంది.

ఆమె బోన్ మారో మార్పిడి ICU నుండే మనుగడ సాధించే అవగాహన పై పనిచేసే ఒక వేదికను మోనికా సృష్టించింది, ఇది క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి సహాయపడుతుంది, ఈ వ్యాధితో పోరాడి బయటపడి విజయం సాధించిన వ్యక్తుల నిజమైన కథల ద్వారా ఆశను పొందుతారు. క్యాన్సర్ అనేది నయం చేయలేని వ్యాధి అని నమ్మించబడిన కోట్లాది మంది కాన్సర్ యోధుల కొరకు ఈ అగాధంను ఆశతో నింపడం అనే లక్ష్యం గల వెబ్ సైట్ అయిన స్ట్రాంగర్ దాన్ కాన్సర్  తో ఆమె ముందుకు వచ్చింది.

ఈ కళంకంను విచ్ఛిన్నం చేసేందుకు, ఆమె క్యాన్సర్ వీరుల అద్భుత విజయాల్లోని నిజమైన కథలను బయటకు తీసుకువచ్చి,  ప్రతి క్యాన్సర్ రోగిని ఈ యుద్ధంలో పోరాడటానికి మరియు గెలవటానికి ప్రేరేపించాలని నిర్ణయించుకుంది. నేటి వరకు, స్ట్రాంగర్ దాన్ కాన్సర్  ప్రపంచానికి అసంఖ్యాక ధైర్యం మరియు నిర్ణయం కథలను తీసుకువచ్చింది మరియు హృదయపూర్వక మరియు ఉత్తేజకరమైన విజయ గాథలతో క్యాన్సర్ సోకినవారికి స్ఫూర్తినిస్తోంది. మోనికా ఇంకా క్యాన్సర్ తో పోరాడుతున్నప్పటికీ, ఆమె దానికి గట్టి పోటి ఇస్తోంది. ఆమె వైద్యులు ఆమెను మంచి తెలివైనది అని పిలుస్తారు. ఆమె తన సానుకూల ధృక్పధం, వైద్యుల మీద నమ్మకం మరియు ఒక ఆరోగ్యకరమైన జీవన శైలి తో వ్యాధిని నియంత్రణలో ఉంచుకుంది. నిజానికి, ఈరోజు నాకు ఒక విషయం తెలుసు. ఆమె నాకంటే చాలా ధృడమైనది, తెలివైనది మరియు చాలా కృతనిశ్చయం గలది. ఆమెనే నాకు స్ఫూర్తి మరియు నా చిరునవ్వుకు కారణం.

ఇది స్ట్రాంగర్ దాన్ కాన్సర్  లో సహ వ్యవస్థాపకురాలు మరియు కథా సంపాదకురాలైన సోనికా బక్షిచే వ్రాయబడిన వ్యక్తిగత కథ. మాజీ టీవీ జర్నలిస్ట్ మరియు పూర్తికాల PR ప్రొఫెషనల్ అయిన సోనికా ప్రయాణాన్ని ఇష్టపడుతుంది. ఆమె పుస్తక పఠనం మరియు వ్రాయడం ఇష్టపడే ఒక జూనియర్ మారథానర్.

* 22 ఆగష్టున మోనికా క్యాన్సర్ తో తన యుద్ధంలో ఓడిపోయింది, కానీ జీవితాన్ని పూర్తిగా జీవించడంలో విజయం సాధించింది. మోనికా, షీరోస్ లో పనిచేసే మేము నిన్ను బాగా మిస్ అవుతాము. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము.

 

15233390611523339061
Jayanthi


Share the Article :